ఏపీలో మున్సిపాల్టీగా అమరావతి..సీఎం జగన్ కీలక నిర్ణయం

-

ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి మరో సంచలన నిర్నయం తీసుకున్నారు. అమరావతి మున్సిపాల్టీ ఏర్పాటు దిశగా ముమ్మరంగా జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే.. అమరావతి మున్సిపాల్టీలో 22 గ్రామాల విలీనంపై గ్రామ సభల నిర్వహణకు షెడ్యూల్ ఖరారు చేసింది. తుళ్లూరులోని 19, మంగళగిరిలోని 3 గ్రామాల్లో ఈ నెల 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు గ్రామ సభల నిర్వహణకు షెడ్యూల్ విడుదల అయింది.

మున్సిపాల్టీలో విలీనంపై గ్రామసభల ద్వారా అభ్యంతరాలు.. అభిప్రాయాలు స్వీకరించనున్నారు అధికారులు. ఇక అటు ఈ నెల 12వ తేదీ నుంచి మహా పాదయాత్రకు అమరావతి రాజధాని రైతులు సిద్దమవుతోన్నారు. కాగా.. అటు అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ…ఈ రాజధాని అంశాన్ని రాజకీయంగా వాడుకుంటూ ముందుకెళుతున్నాయి.

రాష్ట్రం విడిపోయాక అప్పుడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు..ఏకపక్షంగా అమరావతిని రాజధానిగా ప్రకటించేశారు…ఏదో మొక్కుబడిగా అప్పుడు జగన్ మద్ధతు ఇచ్చారు. ఇక చంద్రబాబు ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు అమరావతిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయలేదు. గ్రాఫిక్స్‌లు చేసి జనాలని మురిపించారు. ఇక అక్కడ టీడీపీ లెక్కలేనంత అవినీతి, అక్రమాలకు పాల్పడిందని వైసీపీ ఆరోపిస్తూ…అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చింది. ఈ వివాదం ఇంకాను చెలరేగుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version