రాత్రి కురిసిన వర్షానికి నీటమునిగింది అమరావతి. అటు మరోసారి అమరావతి ఐకానిక్ టవర్స్ నిండా మునిగింది. గుంటూరు జిల్లాలో రాత్రి కురిసిన వర్షానికి ఐకానిక్ టవర్స్‌లోని రెండు భవనాలు వద్ద భారీగా వరద నీరు చేరింది.

గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరద ముంచేస్తుంది. మంగళగిరి, తెనాలి, దుగ్గిరాల, కొల్లిపర మండలాలలో పొలాల్లోకి భారీగా వరద నీరు చేరింది. పేదపరిమి వద్ద కొటేళ్ల వాగు ఉధృతి ఎక్కువగా ఉండడంతో పేద పరిమి – తుళ్లూరు రూట్, లాం వద్ద కొండవీటి వాగు ఉప్పొంగడంతో గుంటూరు – తాటికొండ రూట్, సత్రం వాగు, పీలేరు వాగు ఉప్పొంగడంతో గుంటూరు – మాచర్ల రోడ్డులో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
మరోసారి నిండా మునిగిన అమరావతి ఐకానిక్ టవర్స్
గుంటూరు జిల్లాలో రాత్రి కురిసిన వర్షానికి ఐకానిక్ టవర్స్‌లోని రెండు భవనాలు వద్ద భారీగా చేరిన వరద నీరు https://t.co/5m9AAjdY1I pic.twitter.com/p8cDdvwpVM
— Telugu Scribe (@TeluguScribe) August 13, 2025