భారత్ లో విడుదలైన అమేజ్‌ఫిట్ వెర్జ్ లైట్ స్మార్ట్ వాచ్ …!

-

ప్రస్తుత కాలంలో స్మార్ట్ వాచ్ లు ఫిట్నెస్ బ్యాండ్ వాడకం ఎక్కువ జరుగుతోంది. దేశ ప్రజల్లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. ఇందుకు తగ్గట్టు గత సంవత్సరం ఆగస్టు నెలలో ఏకంగా రూ.6999 తో భారత మార్కెట్లోకి వచ్చిన అమేజ్‌ఫిట్ వెర్జ్ లైట్ స్మార్ట్ వాచ్ ఈ రోజు మళ్ళీ 2000 రూపాయల తగ్గింపుతో కేవలం రూ. 4999 లకే విడుదలయింది. ఇందులో వివిధ రకాల స్పోర్ట్స్ మోడ్స్ ఉంటాయి. జిపిఎస్, బ్లూటూత్ 5.0 లాంటి మరెన్నో ఇతర సదుపాయాలు కూడా ఇందులో లభిస్తాయి.

csm_Amazfit_Verge_Lite_Intro

ఈ స్మార్ట్ వాచ్ ఆండ్రాయిడ్ 4.4 తర్వాతి వర్షన్, అలాగే ఐఓఎస్ 9 కన్నా పైన ఉండే అప్డేట్స్ ఉండే వాళ్లకు మాత్రమే ఈ స్మార్ట్ వాచ్ కంపాటబుల్ అవుతుంది. మొబైల్ లో వచ్చే వివిధ రకాల ముఖ్యమైన నోటిఫికేషన్లను ఈ స్మార్ట్ వాచ్ లో మనం మానిటరింగ్ చేసుకోవచ్చు. అంతే కాకుండా ఇందులో మ్యూజిక్ కంట్రోల్, సైలెంట్ అలారం, ఈవెంట్ రిమైండర్ లాంటి అనేక సదుపాయాలు పొందుపరిచారు. వీటితో పాటు సైక్లింగ్, వాకింగ్, రన్నింగ్, క్లైంబింగ్ లాంటి వివిధ స్పోర్ట్స్ మోడల్ లను కూడా నిక్షిప్తం చేశారు. ఇక ఇందులో 390 mah కెపాసిటీ కలిగిన బ్యాటరీ అందుబాటులో ఉంది. ఒకసారి ఈ వాచ్ ని రీఛార్జ్ చేస్తే 20 రోజులపాటు బ్యాటరీ బ్యాకప్ లభిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version