వేశ్య పాత్రలో రకుల్ ‌..!

-

టాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్‌గా వెలుగొందిన రకుల్ ప్రీత్ సింగ్‌కు ప్రస్తుతం దక్షిణాది నుంచి అవకాశాలు తగ్గాయి. తాజాగా ఓ వేశ్య పాత్రలో నటించేందుకు రకుల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ముంబై రెడ్ లైట్ ఏరియాకు చెందిన ఓ ప్రముఖ వేశ్య జీవిత చరిత్ర ఆధారంగా ఓ బయోపిక్ తెరకెక్కబోతోందట. ఆ సినిమాలో రకుల్ ప్రధాన పాత్రలో కనిపించబోతోందట. బోల్డ్ రోల్ అయినప్పటికి నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర కావడంతో రకుల్ ఓకే చెప్పిందట. అయితే మ‌రి ఈ వార్త నిజమో, కాదో తెలియాలంటే అధికారికంగా క్లారిటీ వ‌చ్చేంత వ‌ర‌కూ వెయిట్ చేయాల్సిందే.

రకుల్  ఇప్పటికే `భారతీయుడు 2`లో రెండో నాయికగా నటిస్తోంది. వేరొక హిందీ చిత్రంలోనూ నటిస్తోంది. ఇప్పటికే పలువురు బాలీవుడ్ టాలీవుడ్ నాయికలు వేశ్య పాత్రల్లో అద్భుత అభినివేశంతో మెప్పించారు. మాధురి ధీక్షిత్ – టబు-ప్రియాంక చోప్రా- విద్యాబాలన్- కరీనా కపూర్ లాంటి బాలీవుడ్ అగ్ర కథానాయికలు వేశ్య పాత్రల్లో మైమరిపించారు. టాలీవుడ్ లోనూ మంజు భార్గవి – జయసుధ – భాను ప్రియ లాంటి టాప్ హీరోయిన్స్ వేశ్య పాత్రల్లో మురిపించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version