రూ.4,999కే అమేజ్‌ఫిట్ నూత‌న స్మార్ట్‌వాచ్‌..!

-

వియ‌ర‌బుల్ డివైసెస్ త‌యారీదారు హువామీ.. అమేజ్‌ఫిట్ బీఐపీ ఎస్ పేరిట భార‌త్‌లో ఓ నూత‌న స్మార్ట్‌వాచ్‌ను విడుద‌ల చేసింది. ఇందులో 1.28 ఇంచుల క‌ల‌ర్‌ఫుల్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఔట్‌డోర్‌లో ఉన్న‌ప్పుడు కూడా ఈ డిస్‌ప్లే ప‌ర్‌ఫెక్ట్‌గా క‌నిపిస్తుంది. ఈ వాచ్‌కు వాట‌ర్ రెసిస్టెన్స్ ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు. 40 రోజుల వ‌ర‌కు బ్యాట‌రీ బ్యాక‌ప్ వ‌స్తుంది. బ్లూటూత్ ద్వారా ఫోన్‌కు క‌నెక్ట్ అయి ఈ వాచ్‌లో మ్యూజిక్‌ను కంట్రోల్ చేయ‌వ‌చ్చు. అలాగే బిల్టిన్ జీపీఎస్‌ను కూడా ఇందులో అందిస్తున్నారు. 10 ర‌కాల స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి.

అమేజ్‌ఫిట్ బీఐపీ ఎస్ స్పెసిఫికేష‌న్లు…

* 1.28 ఇంచ్ క‌ల‌ర్ ఆల్వేస్ ఆన్ రిఫ్లెక్టివ్ ట‌చ్ డిస్‌ప్లే
* 176 x 176 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్
* స్టెప్ కౌంట‌ర్‌, స్మార్ట్‌ఫోన్ నోటిఫికేష‌న్స్‌, 10 ర‌కాల స్పోర్ట్స్ మోడ్స్
* ఆప్టిక‌ల్ హార్ట్ రేట్ సెన్సార్‌, బ్లూటూత్ 4.2 ఎల్ఈ
* ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ కంపాట‌బిలిటీ
* ఫోన్ మ్యూజిక్ కంట్రోల్‌, జీపీఎస్
* వాట‌ర్ రెసిస్టెన్స్‌, 200 ఎంఏహెచ్ బ్యాట‌రీ
* 40 రోజుల వ‌ర‌కు బ్యాట‌రీ బ్యాక‌ప్‌

అమేజ్‌ఫిట్ బీఐపీ ఎస్ స్మార్ట్‌వాచ్.. బ్లాక్‌, బ్లూ, పింక్‌, వైట్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌లైంది. రూ.4,999 ధ‌ర‌కు ఈ వాచ్ వినియోగ‌దారుల‌కు ల‌భిస్తోంది. దీన్ని అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, మింత్రా, అమేజ్‌ఫిట్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌తోపాటు దేశ‌వ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని రిటెయిల్ స్టోర్స్‌లోనూ విక్ర‌యిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version