ఆరోగ్యకరమైన జీవితానికి అలవాట్లలో చిన్న చిన్న మార్పులు పెద్ద ఫలితాలను అందిస్తాయి. అలాంటి వాటిలో ఒకటి ఉదయం అల్పాహారంలో మొలకలు తినడం.ఇవి పోషకాలతో నిండి ఉండి శరీరానికి అవసరమైన విటమిన్లను, ఖనిజాలు, ప్రోటీన్లు సమృద్ధిగా అందిస్తాయి.. మరి ఉదయం మొలకలు తీసుకోవడం వల్ల లభించే ప్రయోజనాలు చూద్దాం.
తక్షణ శక్తి : మొలకలు శక్తిని పెంచుతాయి ఉదయం వీటిని తినడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు.శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. జీర్ణ క్రియ సులభంగా జరిగి, శరీరానికి తేలికగా అనిపిస్తుంది.
బరువు నియంత్రణ: రోజు ఉదయం గుప్పెడు మొలకలు తినడం వల్ల శరీరానికి ఎన్నో కేలరీలు శక్తి అందుతాయి. ఇవి తీసుకోవడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. వీటిలో ఫైబర్ అధికంగా ఉండడంతో ఎక్కువసేపు ఆకలి వేయదు దీని వల్ల అధికంగా తినాలి అని అలవాటు తగ్గి బరువు కంట్రోల్లోకి వస్తుంది.
డయాబెటిస్ వారికి : ప్రతిరోజు అల్పాహారం లో డయాబెటిస్ ఉన్నవారు మొలకలు తినడం వలన వారికి ఇవి ఎంతో ప్రయోజనం కలిగిస్తాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి తద్వారా షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి.

గుండె ఆరోగ్యం: మొలకలు గుండె ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైనవి వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండెపోటు, రక్తపోటు వంటి సమస్యలను తగ్గిస్తాయి.
చర్మం జుట్టు ఆరోగ్యం: ప్రతిరోజు మొలకలు తినడం అలవాటు చేసుకున్న వారి జుట్టు మరియు చర్మం ఎంతో ఆరోగ్యకరంగా ఉంటాయి . వీటిలో ఉండే విటమిన్ C, విటమిన్ E, ఐరన్ వంటి పోషకాలు చర్మానికి కాంతి ని, జుట్టుకు బలాన్ని అందిస్తాయి.
మొలకలు తయారు చేయడం చాలా సులభం పెసలు, గ్రీన్ గ్రామ్, శనగలు వంటి పప్పులను రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు ఉదయం గాలి వచ్చే ప్రాంతంలో ఉంచితే సులభంగా మొలకలు వస్తాయి. వీటిని పచ్చిగా లేదా తేలికగా ఉడికించి అయినా తినవచ్చు.
మొత్తం మీద ఉదయం మొలకలు తినడం ఆరోగ్యానికి చిన్నపాటి మార్పు అయినా ఫలితాలు మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి దీని అలవాటు చేసుకుంటే శరీరం తేలికగా మారుతుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి.
(గమనిక :పైన ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే)