భగవాన్ శ్రీకృష్ణుడు హిందూ సనాతన ధర్మంలో అత్యంత పవిత్రమైన అవతారాల్లో ఒకరు. ప్రతి సంవత్సరం భద్రపద మాసంలో జరిగే కృష్ణాష్టమి రోజున ఆయన జన్మదినం ఘనంగా జరుపుకుంటారు ఈరోజు శ్రీకృష్ణుని లీల చదవడం, వినడం మహాపుణ్యాన్ని అందిస్తుందని హిందూ శాస్త్రాలు చెబుతున్నాయి.అంతేకాక శ్రావణమాసం లో ఈ లీలలు చదవటం ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తాయి. మరి శ్రీకృష్ణ లీలలో కొన్నింటిని మనము తెలుసుకుందాం..
శ్రీకృష్ణ జన్మ: మధురలో జైల్లో వసుదేవుడు, దేవకీకి జన్మించిన శ్రీకృష్ణుడు కేవలం మానవ శిశువు మాత్రమే కాదు, దివ్య స్వరూపం. ఆ రాత్రి ఆయన జననం సంభవించిన క్షణం నుంచే అధర్మానికి ముగింపు ధర్మానికి వెలుగుగా చెప్పుకుంటారు.
పూతన వధ : విష పాలు ఇచ్చి కృష్ణుని సమ్మరించాలనుకున్న రాక్షసి పుతన. శిశువు రూపంలో ఉన్న శ్రీకృష్ణుడి ను హరించడానికి వచ్చిన పూతనను బాలకృష్ణుడు ఆమె చను పాలను పీల్చి సంహరించాడు. ఇది చెడును ఏ రూపంలో వచ్చినా దైవం సంహరిస్తుందని తెలియజేసే లీల.
వెన్న దొంగ : గోకుల గోపికలు చేసే వెన్నను దొంగలించి తినేవాడు చిన్నారి కృష్ణుడు. ఆ ఆటల ద్వారా భక్తుల హృదయాలను దోచుకున్నాడు. శ్రీకృష్ణుడు చిన్నవాడే అయినా గోపికల ఇళ్లల్లోకి వెళ్లి వెన్నని దొంగలించి తినేవాడని భాగవతంలో మనకి తెలుపబడింది. అందుకే ఆయనను వెన్నదొంగ అని కూడా పిలుస్తారు..

కాళీయ మర్దన : విషంతో యమునను కలుషితం చేసిన కాళీయ నాగుడిని శ్రీకృష్ణుడు నృత్యం చేస్తూ శాంతింప చేస్తాడు. ఇది మన హృదయంలోని దుష్ట భావాలను తొలగించుకోవాలని ఆధ్యాత్మిక బోధనగా శ్రీకృష్ణుడు తెలియజేసిన లీల.
గోవర్ధనగిరి లీల : ఇంద్రుడు కురిపించిన ఘోర వర్షం నుండి గోకుల ప్రజలను రక్షించేందుకు శ్రీకృష్ణుడు తన చిన్ని వేలు మీద గోవర్ధనగిరిని ఎత్తిపట్టాడు. గోకుల ప్రజలంతా ఆ గోవర్ధన గిరి కిందకు చేరి రక్షణ పొందారు. ఈ లీల ఆయన ప్రజలపై అపారమైన కరుణను రక్షణను చూపిస్తుందని తెలియజేస్తుంది.
గోపికలతో రాసలీల: గోపికలతో చేసిన రాసక్రీడ కేవలం నృత్యం కాదు, భక్తి శిఖరాగ్రిని సూచించే ఆధ్యాత్మిక లీల. ప్రతీ గోపికతో శ్రీకృష్ణుడు ఒకేసారి నృత్యం చేశాడు. దీని అర్ధం భక్తుడు ఎక్కడ ఉంటే అక్కడ దైవం ఉంటాడు అని తెలిపేందుకు సత్యంగా చెప్పబడుతుంది.
శ్రావణ మాసం లో ఈ లీలలను చదివితే మనసు ప్రశాంతమవుతుంది భక్తి పారవశ్యం కలుగుతుంది. శ్రీకృష్ణుని లీలలు జీవన మార్గదర్శకాలు భక్తిలో నిత్యం ఆనందానికి మూలంగా ఉంటాయి. అని హిందూ శాస్త్రాలు మనకి చెబుతున్నాయి.