బాబుకి కౌలు చేయడం మాని…సొంత చేను చేసుకో : అంబటి ట్వీట్

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి అంబటి రాంబాబు సంచలన ట్వీట్ చేశారు. బాబుకి కౌలు చేయడం మాని సొంత చేను చేసుకో అంటూ ఎద్దేవా చేశారు. కొంతయినా ఫలితం ఉండొచ్చు అని.. చంద్రన్న “చేతిలో పావు” కళ్యాణ్ గారు ! అంటూ ఓ రేంజ్ లో సెటైర్ వేశారు మంత్రి అంబటి రాంబాబు.

నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడడమే లక్ష్యమని పవన్‌ చెప్పాడని, పవన్‌కు తనకంటూ సొంత ఆలోచన లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీ మంత్రుల మీద సెటైర్లు వేసిన విషయం పవన్‌కు గుర్తు లేదా? అని సూటిగా ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ రైతుల గురించి మాట్లాడాటం విచిత్రంగా ఉందని, కౌలు రైతులకు ఈ ప్రభుత్వం చేసిన ప్రయోజనం ఇంత వరకు ఏ ప్రభుత్వమూ చేయలేదన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version