లాయర్‌ సిద్దార్థ్‌ లూథ్రాకు మంత్రి అంబటి పరోక్ష కౌంటర్‌

-

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టై రాజమహేంద్రవరం కేంద్రకారాగారంలో ఉన్న విషయం తెలిసిందే. అయితే.. చంద్రబాబు తరఫున వాదిస్తోన్న సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా చేసిన ట్వీట్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మంత్రి అంబటి రాంబాబు పరోక్షంగా స్పందించారు. ఈ మేరకు ఆయన పేరు పేర్కొనకుండా సోషల్ మీడియా వేదిక ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ పెట్టారు. న్యాయపోరాటం కంటే ఆయుధ పోరాటమే మిన్న అన్న న్యాయవాది మాటలతో ఈ కేసు బలం అర్థమైందంటూ విమర్శలు గుప్పించారు అంబటి రాంబాబు.

అంతకుముందు జైల్లో చంద్రబాబుతో ములాఖత్‌కు ముందు సిద్ధార్థ లూథ్రా చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. అన్ని ప్రయత్నాలు చేసినా న్యాయం కనుచూపుమేర లేకుంటే ఇక కత్తిపట్టడమే, పోరాటానికి ఇదే సరైన విధానమంటూ గురుగోవింద్ సింగ్ సూక్తిని ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు సిద్ధార్థ్‌ లూథ్రా. అయితే.. ఆయన ట్విట్‌పై అంబటి రాంబాబు పైవిధంగా స్పందించారు.

ఇదిలా ఉంటే.. బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి టార్గెట్ చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై పురందేశ్వరి స్పందించిన తీరును వైసీపీ నేతలు తప్పుబట్టారు. ఈ క్రమంలో విజయసాయిరెడ్డి మరోసారి ఆమెను లక్ష్యంగా చేసుకుని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version