ఆ మహిళా మంత్రి చరిత్ర బయటికి తీశాం : వర్ల రామయ్య

-

చంద్రబాబు అరెస్ట్‌పై టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. దీంతో.. వైసీపీ ప్రభుత్వంలో ఉన్న నేతలను టార్గెట్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబును నంద్యాల నుంచి రోడ్డుమార్గంలో విజయవాడ సిట్ కార్యాలయానికి తీసుకువెళుతున్నప్పుడు పోలీసులు వ్యవహరించిన తీరు బాధాకరం అని పేర్కొన్నారు.

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా సత్తెనపల్లిలో ఆందోళనకు దిగిన కార్యకర్తలపై డీఎస్పీ, పోలీసు అధికారులు వ్యవహరించిన తీరు దారుణమని అన్నారు. సత్తెనపల్లిలో టీడీపీ కార్యకర్త మెడపై డీఎస్పీ మోకాలితో తొక్కిపెట్టడం హేయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్తెనపల్లి డీఎస్పీని సస్పెండ్ చేసి, ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

చంద్రబాబును అరెస్టు చేస్తే ఓ మహిళా మంత్రి స్వీట్లు పంచి, బాణాసంచా కాల్చుతూ రోడ్డుపై నృత్యం చేయడాన్ని బట్టి ఆమెకు చంద్రబాబుపై ఎంతో ద్వేషం ఉందో అర్థమైంది. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన నాయకుడు చంద్రబాబు భార్య గురించి ఆ మహిళా వెకిలి మంత్రి తప్పుగా మాట్లాడుతారా? మా అధినేత భార్య భువనేశ్వరి గారి పట్ల మీరు చూపించిన వెకిలితనం జుగుప్సాకరంగా ఉంది.

ఆ మహిళా మంత్రి చరిత్ర బయటికి తీశాం. చెన్నైలో ఎన్ని ఆస్తులు కొన్నారో దస్తావేజులతో సహా సేకరించాం. పూనమలై హైవే దగ్గర ఎన్ని ఎకరాల భూములు కొన్నారో అన్ని వివరాలు మా వద్ద ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో ఆమెను జైలుపాలు చేస్తాం. పేర్ని నాని, అమర్నాథ్, అంబటి రాంబాబుల చిట్టాలు కూడా మా వద్ద వున్నాయి. మేం అధికారంలోకి రాగానే వారికి కూడా రాజమండ్రి జైలులో చిప్ప కూడు తినిపిస్తాం.

Read more RELATED
Recommended to you

Exit mobile version