పవన్ కళ్యాణ్ అంత పెద్ద మగాడా? – అంబటి రాంబాబు

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంత్రి అంబటి రాంబాబు. బుద్ధి జ్ఞానం లేని పవన్ కళ్యాణ్ కు అసలు రాజకీయాలు తెలుసా? అనీ ఫైర్ అయ్యారు. చంద్రబాబుకు ఊడిగం చేస్తున్న పవన్ కళ్యాణ్ దగ్గర ఉంటారో.. జగన్ రెడ్డిని నమ్ముకున్న అంబటి వెంట ఉంటారో కాపులు తేల్చుకోవాలని సూచించారు. “మా పవన్ అంటూ గోక్కుంటున్నారు.. గోక్కుని చంద్రబాబు దగ్గర పవన్ తో కలిసి చాకిరి చేయండి” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాపులను చంద్రబాబు దొడ్లో కట్టేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రెండు స్థానాలలో పోటీ చేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్ నాపై ఆరోపణలు చేస్తాడా? అని ఎద్దేవా చేశారు. వైసీపీని అధికారంలోకి రానివ్వను.. ఓట్లు చీలనివ్వనంటున్న పవన్ కళ్యాణ్ అంత పెద్ద మగాడా? అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version