తల్లిని చూసేందుకు ఆసుపత్రికి చేరుకున్న ప్రధాని మోదీ

-

ప్రధాని నరేంద్ర మోడీ తండ్రి హీరబెన్ స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆమెను గుజరాత్ అహ్మదాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ఇటీవల హీరాబెన్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె స్వల్ప అనారోగ్యానికి గురికావడంతో అహ్మదాబాద్ లోని యుఎన్ మెహతా ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని హెల్త్ బులిటెన్ విడుదల చేశారు వైద్యులు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఆమె ఆరోగ్యం పై ఆరా తీసేందుకు ఆసుపత్రికి చేరుకున్నారు.

ప్రస్తుతం అనారోగ్యానికి గురైన తన తల్లిని చూసేందుకు హుటాహుటిన గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా యుఎన్ మెహతా ఆసుపత్రికి వెళ్లారు. తల్లి హీరా బెన్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. ఇక మరోవైపు మోడీ తల్లి హీరాబెర్ త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆకాంక్షించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version