తెలంగాణలో జాతీయ పార్టీల మధ్యే ఫైట్ జరుగుతుంది…టీఆర్ఎస్ సైతం బీఆర్ఎస్ గా మరి జాతీయ పార్టీగా మారడంతో..ఇప్పుడు మూడు జాతీయ పార్టీల మధ్య ఆసక్తికరమైన ఫైట్ నడుస్తోంది. బీఆర్ఎస్-బీజేపీ-కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. ఆ మూడు పార్టీల పోటీ పక్కన పెడితే..ఈ మూడు పార్టీల్లో ఏదొక పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలిచే పరిస్తితి ఉంది. ఇక ఎవరు గెలుస్తారనేది ప్రజలు నిర్ణయిస్తారు.
అయితే ఎవరు అధికారంలోకి వస్తారనే దానికంటే ఎవరు సీఎం అవుతారనేది ఆసక్తికరంగా మారింది. ముందు బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుకుంటే..ఆ పార్టీ గాని అధికారంలోకి వస్తే..కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతారు. అందులో డౌట్ లేదు. ఒకవేళ ఆయన గాని కేంద్ర రాజకీయాల్లోకి వెళితే..కేటీఆర్ సీఎం అవుతారు. ఇందులో డౌట్ లేదు. బీఆర్ఎస్ విషయం పక్కన పెడితే. కాంగ్రెస్ లో అందరూ సీఎంలే అనే పరిస్తితి. కానీ ఆ పార్టీకి అధికారంలోకి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఆ ఛాన్స్ ఉన్నా సరే..ఆ పార్టీలో రేవంత్ రెడ్డి, ఉత్తమ్, భట్టి, జానారెడ్డి, జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు..అబ్బో ఇలా లిస్ట్ పెద్దదే.
ఆ రెండు పార్టీలని పక్కన పెడితే..బీజేపీ గురించి మాట్లాడుకుంటే..ఈ పార్టీలో కూడా సీఎం రేసులో ఉన్నవారు ఎక్కువగానే ఉన్నారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్, ఈటల రాజేందర్, వివేక్ లాంటి వారు ఉన్నారు. తాజాగా డీకే అరుణ సైతం సీఎం పదవి ఆశిస్తున్నట్లు చెప్పారు. కానీ బీజేపీ గెలిచి అధికారంలోకి వస్తేనే సీఎం రేసు ఉంటుంది. సీఎం పదవిని అధిష్టానమే ఫిక్స్ చేస్తుంది.
ప్రస్తుతానికి అధిష్టానం సీఎం ఎవరు దానిపై క్లారిటీ ఇవ్వట్లేదు. పోనీ ఎన్నికల ముందు ఏమైనా అభ్యర్ధిని చెప్పి ముందుకెళ్తారా? లేదా ఓ సామాజికవర్గానికి సీఎం పదవి ఇస్తామని చెబుతారా? అనేది క్లారిటీ లేదు. సీఎం పదవిపై ప్రకటన లేకుండానే బీజేపీ ఎన్నికలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.