వైసీపీలో ఇమడలేని వాళ్ళు వెళ్లి పోవచ్చు : అంబటి రాంబాబు

-

రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ పాలక వర్గాలను టీడీపీ లాక్కుంది అని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గుంటూరులో స్టాండింగ్ కమిటీ లో టీడీపీ నాయకులు గెలిచారు. గుంటూరు లో ఉన్న 57 డివిజన్ లలో వైసిపి కి 46 కార్పొరేటర్ లు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన స్టాండింగ్ కమిటీ కోసం మా కార్పొరేటర్ లను లాక్కున్నారు. కొంత మంది తో క్రాస్ ఓటింగ్ చేపించారు.

అయితే ఈ క్రాస్ ఓటింగ్ చేసిన వారికి నైతిక విలువలు లేవు. బాహాటంగా వెళ్లిన వారి కంటే లోపల ఉండి వెన్ను పోటు పొడిచిన వాల్లు పార్టీ కి ప్రమాదకరం. ఈ దేశంలో పార్టీ ఫిరాయింపుల చట్టం అమలు అవడం లేదు. అందుకే ఇలాంటి ఘటనలు ఎక్కువ అవుతున్నాయి. ఇప్పటికైనా పార్టీలో ఇమడ లేని వాళ్ళు వెళ్లి పోవచ్చు. లోపల ఉండి కుట్ర రాజకీయాలు చేయవద్దు. మేయర్ ను ,డిప్యూటీ మేయర్ ను కూడా మార్చాలని చూస్తున్నారు. అయితే ఎన్ని ఘోరాలు చేసైనా స్థానిక సంస్థల ను వశం చేసుకోవాలని చూస్తున్నారు. అయితే పార్టీ గీత దాటిన వారిపై సరైన సమయంలో చర్యలు ఉంటాయి అని అంబటి రాంబాబు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version