హాజరుశాతం లేదని ఫీజు నిరాకరణ.. ఓయూలో విద్యార్థుల ఆందోళన

-

ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. 75% హాజరు శాతం లేదని పరీక్ష ఫీజు తీసుకోవడం లేదని, తక్షణమే ఫీజు తీసుకుని పరీక్షలు రాసేందుకు అనుమతి ఇవ్వాలని, డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు.

ఈ క్రమంలోనే ఓయూలోని రహదారిపై బైఠాయించిన విద్యార్థులు పరీక్ష ఫీజు తీసుకుని, విద్యార్థులను పరీక్షలు రాసేందుకు అనుమతించాలని విద్యార్థులతో పాటు విద్యార్థి సంఘం నేతలు సైతం ఆందోళన చేపట్టారు. దీంతో ఓయూలోని ప్రధాన రోడ్డులో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కాగా, ఈ విషయంపై ఓయూ అధికారులు వెంటనే స్పందించాలని విద్యార్థి సంఘం నేతలు కోరుతున్నారు. పరీక్షలు రాయనీయకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version