చంద్రబాబుపై మాకు కక్ష లేదు: అంబటి రాంబాబు

-

స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్న నారా చంద్రబాబు నాయుడు గురించి మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంతసేపటికీ చంద్రబాబు అరెస్ట్ అన్యాయం , అక్రమం అని టీడీపీ ఎంతలు విమర్శిస్తుంటే… వాటిపై అంబటి రాంబాబు తనదైన శైలిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై మాకు ఎటువంటి కక్ష లేదని అంబటి రాంబాబు స్పష్టంగా తెలియచేశారు. చంద్రబాబును స్కిల్ స్కాం కేసులో అన్ని ఆధారాలతోనే అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు అంబటి రాంబాబు. ఈ అరెస్ట్ నిజం గెలవడం వల్లనే జరిగిందంటూ అంబటి రాంబాబు అభిప్రాయపడ్డారు. చంద్రబాబు ఎలాగైనా కాపాడాలని బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ప్రయత్నాలు చేస్తోందంటూ అంబటి ప్రస్తావించారు.

ఇక మద్యం బ్రాండ్ల గురించి పురందేశ్వరి చేస్తున్న విమర్శలు చేస్తున్నారు, కానీ ఆమెకు తెలియని విషయం ఏమిటంటే ప్రస్తుతం ఏపీలో ఉన్న అన్ని బ్రాండ్లకు కూడా చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలోనే అన్ని అనుమతులు ఇచ్చారంట అంబటి కౌంటర్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version