బాబు పనైపోయింది.. లోకేష్ ను దింపినా ఉపయోగం లేదు !

-

టీడీపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు బహిష్కరించాలని నిర్ణయించిందని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. గత ఏడాది ఎన్నికలను రాజకీయ పక్షాలతో సంప్రదించకుండా అర్ధాంతరంగా ఆపినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? అని ఆయన ప్రశ్నించారు. మరి పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ఎందుకు బహిష్కరించలేదు ? అని ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికల్లో మేము గెలిచాం అని టపాసులు కాల్చారని, నిమ్మగడ్డ ఎన్నికల్లో సహకరిస్తారనే ఎన్నికల పెట్టండని అప్పుడు గోల పెట్టారు, ఇప్పుడు వేరే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఓటమి భయంతో  చంద్రబాబు పారిపోతున్నారని అన్నారు.

లోకేష్ ముఖ్యమంత్రి పై మూడు హెచ్చరికలు జారీ చేస్తాడట, బుడ్డోడు…బుడ్డోడిలా ఉండాలి…ముఖ్యమంత్రి పై హెచ్చరికలు జారీ చేసే స్థాయి ఉందా? అని విమర్శించారు. తిరుపతి ఎన్నికల పై టీడీపీ వైఖరి ఏంటి? ఓటమి భయంతో పారిపోయే వాడు నాయకుడు ఎలా అవుతాడు? అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు వెన్నుపోటు ద్వారానో, ఏదో ఒక పార్టీ సహకారంతోనో రాజ్యాధికారం సాధించాడని, ఇప్పుడు ఒంటరిగా ఎన్నికలు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు పారిపోయాడని అన్నారు. బాబు పనిపోయిందని తాను ఎప్పుడో చెప్పానన్న ఆయన ఇప్పుడు లోకేష్ ను రంగంలోకి దింపినా ఉపయోగం లేదని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version