జలీల్ ఖాన్ సంతకాలు ఫోర్జరీ.. ఏపీ వక్ఫ్ బోర్డులో అక్రమాలు ?

-

ఏపీ వక్ఫ్ బోర్డులో జరిగిన అక్రమాలను సీఈఓ అలీం భాషా వెలికి తీస్తున్న ఘటన కలకలం రేపుతోంది. గత పాలకమండలి సమయంలో జరిగిన అవినీతి, అక్రమాలపై వక్ఫ్ బోర్డు సీఈఓ నివేదిక సిద్ధం చేస్తున్నారు. వక్ఫ్ బోర్డు మాజీ సీఈఓ షబ్బర్ బాషా పై బెజవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అందింది.

అప్పటి బోర్డు చైర్మన్ జలీల్ ఖాన్ సంతకాలు ఫోర్జరీ చేసి ఉద్యోగాలు  ఇప్పించారని మాజీ సీఈఓ షబ్బర్ భాషా పై అభియోగాలు నమోదయ్యాయి. వక్ఫ్ బోర్డు డైరెక్టర్ షేక్ ఖాజా కి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. షేక్ ఖాజాకి ముతావల్లిగా అర్హత లేదని వక్ఫ్ బోర్డుకి వచ్చిన ఫిర్యాదుపై షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు చెబుతున్నారు. ఐదేళ్ల పాటు డైరెక్టర్ పదవి పొడిగించుకోవటంపై కూడా వక్ఫ్ బోర్డు విచారణ చేస్తున్నట్టు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version