కుక్కకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం సైరన్‌తో అంబులెన్స్ వచ్చిన ఘటన పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ వద్ద బుధవారం చోటుచేసుకుంది. అంబులెన్స్ సైరన్ దుర్వినియోగంపై ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా తనిఖీలు నిర్వహించారు.ఈ క్రమంలోనే అతివేగంగా సైరన్‌తో వచ్చిన అంబులెన్స్ చూసి లోపల రోగి ఉన్నాడేమో అని ట్రాఫిక్ పోలీసులు తలుపులు తెరవగా..
అంబులెన్స్‌లో పెంపుడు కుక్క ఉండడం చూసి పోలీసులు షాక్ అయ్యారు. మియాపూర్‌లోని ఆస్పత్రిలో కుక్కకు వెసేక్టమీ ఆపరేషన్ కోసం తీసుకువెళ్తున్నానంటూ డ్రైవర్ సమాధానం చెప్పడంతో అంబులెన్స్ సైరన్ దుర్వినియోగం కింద యజమాని మీద పోలీసులు కేసు నమోదు చేశారు.
కుక్కకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం సైరన్‌తో అంబులెన్స్
పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద ఘటన
అంబులెన్స్ సైరన్ దుర్వినియోగంపై ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా తనిఖీ
అతివేగంగా సైరన్‌తో వచ్చిన అంబులెన్స్ చూసి లోపల రోగి ఉన్నాడేమో అని తలుపులు తెరిచిన ట్రాఫిక్… pic.twitter.com/hbashBfVvF
— BIG TV Breaking News (@bigtvtelugu) March 4, 2025