చంద్రబాబు అనే వ్యక్తికి గతంలో మేం ప్రతిపక్ష హోదా ఇచ్చాం అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. ఎక్కడా రూలింగ్ లేదు. ఇంత మంది శాసన సభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా అని లేదు. ఢిల్లీ మూడు స్థానాలు వచ్చినా ప్రతిపక్ష హోదా ఇచ్చారు. మా ప్రభుత్వ టైంలో ఐదుగురు సభ్యులు మావైపు వచ్చారు. అప్పుడు వాళ్ళకి ప్రతిపక్ష హోదా తీసేయాలంటే తీసెయచ్చు అని తెలిపారు.
అలాగే అసెంబ్లీలో ఉన్నది అధికార, ప్రతిపక్ష పార్టీలే. మీరే అన్నీ పాత్రలు ఎలా చేస్తారు. ప్రతిపక్షంలో మా పార్టీ తప్ప వేరే పార్టీ లేదు. ఆ పార్టీకి ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నా ఆ లీడర్ ని ప్రతిపక్ష నేత అనే అంటారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించనివ్వను అంటే ఎలా మాట్లడగలుగుతాం. అసెంబ్లీలో ఐదే నిమిషాలు అంటే ఏం మాట్లాడగలం అని పేర్కొన మాజీ సీఎం.. పవన్ కార్పొరేటర్ కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ. ఆయన జీవిత కాలంలో ఇప్పుడే ఎమ్మెల్యే అయ్యాడు అని పేర్కొన్నారు.