రష్యా సైనిక విన్యాసాలు.. ఆందోళనలో అమెరికా

-

ఈనెల 1న రష్యా భారీ ఎత్తున సైనిక విన్యాసాలు చేపట్టింది. ఏడో తేది వరకు వొస్టాక్ 2022 పేరుతో ఈ విన్యాసాలు నిర్వహించనున్నట్లు రష్యా అధికారవర్గాలు వెల్లడించాయి. ఈ విన్యాసాల్లో భారత్‌, చైనా, లావోస్‌, మంగోలియా, నికరాగువా, సిరియాతోపాటు మరికొన్ని మాజీ సోవియట్‌ దేశాలు పాల్గొంటాయని మాస్కో తెలిపింది.

వొస్టాక్‌లో పాల్గొనే భారత సైన్యం రోజూవారీ కార్యకలాపాలకు సంబంధించిన చిత్రాలను రష్యా సైన్యం విడుదల చేసింది. ఆ దేశంలోని గుర్తు తెలియని ప్రాంతంలో భారత సైనికుల కవాతు, వంటావార్పు, పాటలు పాడుతున్న దృశ్యాలు అందులో ఉన్నాయి. 50 వేల మంది జవాన్లు, 140 యుద్ధవిమానాలు, 60 యుద్ధ నౌకలు సహా అయిదు వేలకు పైబడి ఆయుధ యూనిట్లు ఈ విన్యాసాల్లో పాల్గొంటాయని మాస్కో రక్షణ శాఖ ప్రకటించింది. ఉక్రెయిన్‌పై కూర్రమైన యుద్ధం చేస్తున్న రష్యాతో కలిసి ఇతర దేశాలు పాల్గొనటంపై అమెరికా ఆందోళన చెందుతున్నట్లు శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కరెన్‌ జిన్‌ పిర్రె పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version