అమెరికా రహస్యం లీకైంది ఆ రూమ్ నుంచేనట..

-

అమెరికాకు చెందిన వందల కొద్దీ అత్యంత రహస్య పత్రాలు లీక్ అవ్వడం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఈ లీకేజీతో అమెరికా మిత్రదేశాల మధ్య సంబంధాలూ దెబ్బతినే పరిస్థతి నెలకొంది. అమెరికా ఇంటిదొంగే రక్షణశాఖ రహస్య పత్రాలను ఫొటోలు తీసి మరీ లీక్‌ చేసినట్లు తెలుస్తోంది. ఓ ‘వీడియోగేమ్‌ చాట్‌ రూమ్‌’లో ఈ రహస్య పత్రాలు కొన్ని రోజుల క్రితం ప్రచారంలోకి వచ్చాయి.

పెంటగాన్‌ లీకేజీలపై ‘బెల్లింగ్‌క్యాట్‌ పత్రిక ఓ’ కథనం ప్రచురించింది. ఈ పత్రాలు తొలిసారి మార్చి 1వ తేదీన ‘డిస్కార్డ్‌’ అనే సోషల్‌ మీడియా వేదికపై కనిపించాయి. ఆ తర్వాత వీటి సంఖ్య మరింత పెరిగింది. డిస్కార్డ్‌ను ఎక్కువగా వీడియో గేమర్లు చాట్‌ రూమ్‌ల కోసం వినియోగిస్తుంటారు.

వీటిల్లో మైన్‌క్రాఫ్ట్‌ అనే గేమ్‌ కోసం..ఫిలిప్పినో యూట్యూబర్‌ కోసం ఏర్పాటు చేసిన చాట్‌ రూమ్‌ల్లో ఇవి ప్రత్యక్షం అయ్యాయి. ఈ ఛానెల్స్‌లో మైన్‌క్రాఫ్ట్‌ గేమ్‌, ఉక్రెయిన్‌ యుద్ధంపై చిన్న వాదన జరిగిన సమయంలో ఓ యూజర్‌ ఇక్కడ కొన్ని లీకైన పత్రాలున్నాయి అని పేర్కొని.. పెద్ద సంఖ్యలో స్క్రీన్‌ షాట్లను షేర్‌ చేశాడు.

ఈ నెల 5న ‘4ఛాన్‌’ అనే మెసేజ్‌ బోర్డులో ఈ రహస్య పత్రాలు ప్రత్యక్షం అయ్యాయి. ఈ నెల 7 నుంచి ఇవి ప్రధాన సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై కూడా ప్రచారంలోకి వచ్చాయి. అసలు లీకేజీలు ఫిబ్రవరి- మార్చి మధ్యలోనే మొదలైనట్లు అనుమానిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version