వైరల్‌ : రన్‌వేపైనే కుప్పకూలిన అమెరికా యుద్ధ విమానం

-

అమెరికాకు చెందిన ఒక యుద్ధ విమానంపై రన్‌వేపై కుప్పకూలింది. అయితే.. ఈ విమానంలో ఉన్న ఫైలెట్‌ సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఆ విమానం కంట్రోల్‌ తప్పడంతో పైలట్‌ దాని నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. టెక్సాస్‌లోని ఫోర్ట్ వర్త్‌లో ఉన్న నేవల్‌ ఎయిర్ స్టేషన్ జాయింట్ రిజర్వ్ బేస్‌లో ఈ సంఘటన జరిగింది. గురువారం ఉదయం 10.15 గంటలకు లాక్‌హీడ్ మార్టిన్‌కు చెందిన ఎఫ్-35బి లైట్నింగ్ ఫైటర్ జెట్, నేవీ ఎయిర్‌ బేస్‌లోని రన్‌పై వర్టికల్‌గా ల్యాండ్‌ అయ్యింది. ఈ సందర్భంగా ఆ యుద్ధ విమానం ముందు భాగం రన్‌వేను ఢీకొన్నది. దీంతో పైలట్‌ నియంత్రణ కోల్పోయాడు.

ఈ నేపథ్యంలో ఆ ఫైటర్‌ జెట్‌ రన్‌వే పై గిరాగిరా తిరిగి అక్కడి ఫెన్సింగ్‌ను ఢీకొట్టింది. ఇంతలో పైలట్‌ ఆ విమానం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. మరోవైపు ఫైర్‌, రెస్క్యూ సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఫైటర్‌ జెట్‌ నుంచి బయట పడిన పైలట్‌ను అక్కడి నుంచి తరలించారు. పరీక్షిస్తున్న యుద్ధ విమానం రన్‌వేపై కూలిందని, ఆ యుద్ధ విమానం నుంచి పైలట్ బయటకు వచ్చి ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడినట్లు అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా, ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version