అమెరికాలోని ప్రజలు భారీగా రోడ్లపైకి వచ్చారు. అధ్యక్షుడు ట్రంప్‌కు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు. అమెరికా వ్యాప్తంగా 50 రాష్ట్రాల్లో 1400 ప్రాంతాల్లో ట్రంప్ వ్యతిరేక నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో కోత, ఆర్థిక మాంద్యం భయాలు, వలస విధానాలపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
సుమారు 6 లక్షల మంది ఈ నిరసనల్లో పాల్గొన్నట్లు అంచనా వేస్తున్నారు.దీనికి తోడు ట్రంప్ ప్రపంచదేశాలపై సుంకాలు భారీగా విధించడం వలన అమెరికా స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి.దీంతో ప్రజలు తమకు ట్రంప్ పాలన వద్దని రోడ్లమీదకు వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. ట్రంప్,మస్క్ నిర్ణయాల వలన తమ ఉద్యోగాలు, మెడికేర్, ఉద్యోగ భద్రత కూడా కోల్పోతున్నామని అమెరికన్ సిటిజన్స్ పెద్దఎత్తున ఆందోళనకు దిగారు.