నాలుగేళ్ల కొడుకుతో బీచ్‌లో బికినీ స్టిల్స్..అమీ జాక్సన్ ఇది ఏమీ అని నెటిజన్ల విమర్శలు

-

బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ అమీ జాక్సన్..సౌత్ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకుంది. ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ ‘ఐ’,‘2.ఓ’ చిత్రాల్లో నటించిన ఈ భామ..పెళ్లి కాకుండానే తల్లి అయిన సంగతి తెలిసిందే. ఇంగ్లిష్ సంస్కృతిని ఫాలో అవుతున్న ఈ సుందరి..సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

అప్పుడెప్పుడో తన బిడ్డ ఫొటో షేర్ చేసిన అమీ జాక్సన్..తాజాగా సోషల్ మీడియాలో షాకింగ్ ఫొటో ఒకటి షేర్ చేసింది. దాదాపు నాలుగేళ్లు ఉన్న తన తనయుడితో బీచ్ లో బికినీలో దిగిన ఫొటోలు షేర్ చేసింది అమీ జాక్సన్. అవి చూసి నెటిజన్లు, సినీ అభిమానులు షాక్ అయ్యారు.

టూ పీస్ బికినీలో ఉన్న అమీ జాక్సన్..తన తనయుడితో ఇటువంటి ఫొటోలు దిగడం ఏంటని ట్రోల్ చేస్తున్నారు. ఈ ఫొటోను పబ్లిక్ గా షేర్ చేయకుండా ఉండాల్సిందని పలువురు నెటిజన్లు అమీ జాక్సన్ కు సలహాలు ఇస్తున్నారు. పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడిన అమీ జాక్సన్ ఇలా బోల్డ్ గా విష సంస్కృతిని ప్రమోట్ చేస్తుందని కొందరు నెటిజన్లు విమర్శిస్తున్నారు. బ్రిటన్ బిజినెస్ మ్యాన్ .జార్జ్ పనాయొటోను ప్రేమించింది. ఆయన వలన పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయి తల్లి అయింది అమీ. త్వరలో అమీ జాక్సన్ బాలీవుడ్ ఫిల్మ్ ఒకటి చేయబోతున్నదని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version