Kirthi Shetty: ‘మాచర్ల నియోజకవర్గం’ నుంచి కృతీ లుక్‌

-

నితిన్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘మాచర్ల నియోజకవర్గం’. ఈ సినిమాను నితిన్ సొంత బ్యానర్లో నిర్మిస్తున్నారు. అయితే.. గ్రామీణ నేపథ్యంలో పోలిటికల్ థ్రిల్లర్ జోనర్లో నడిచే ఈ సినిమాతో, దర్శకుడిగా రాజశేఖర్ రెడ్డి పరిచయమవుతున్నాడు. ఈ సినిమాలో నితిన్‌కు జోడీగా అందాల భామ కృతి శెట్టి నటిస్తోంది. అయితే.. మరో కథానాయికగా కేథరిన్ అలరించనుంది.

అయితే.. ఈ సినిమాలో ‘స్వాతి’గా అందాల భామ కృతి శెట్టి నటిస్తున్నట్లు చిత్ర బృందం ఆమె క్యారెక్టర్‌ ను రివీల్‌ చేసింది. ఇందెలో భాగంగానే.. అందాల భామ కృతి శెట్టి పాత్రకి సంబంధించిన పోస్టర్ ను తాజాగా చేసింది చిత్ర బృందం. ఈ పోస్టర్‌ లో కృతి శెట్టి.. ఎప్పటి లాగే.. మెరిసిపోయింది. చాలా క్యూట్‌ గా ముద్దుగా కృతి శెట్టి కనిపించింది. కాగా.. మహతి స్వరసాగర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను ఆగస్టు 12వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version