AMIT MISHRA RETIREMENT : టీమిండియా స్టార్ అమిత్ మిశ్రా షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు తాజాగా వెల్లడించారు. 42 సంవత్సరాల వయసులో… ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడు అమిత్ మిశ్రా. దాదాపు 25 సంవత్సరాల పాటు టీమిండియా తరఫున అన్ని ఫార్మేట్స్ ఆడాడు.

ఈ 25 ఏళ్ల క్రికెట్ చరిత్రలో టీమిండియా తరఫున 22 టెస్టులు ఆడిన అమిత్ మిశ్రా 36 వన్డేలు కూడా ఆడాడు. అలాగే 10 t20 మ్యాచ్ లు ఆడి చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ లో అత్యధికంగా 174 వికెట్లు తీసి ఏడో బౌలర్ గా నిలిచాడు. ఐపీఎల్ చరిత్రలో మూడు హైట్రిక్ తీసిన ఏకైక బౌలర్ ఇతడే కావడం విశేషం.