పోటీ పరీక్షలు రాసే దివ్యాంగులకు బిగ్ షాక్ పోటీ పరీక్షల్లో దివ్యాంగులే సొంత (స్క్రైబ్) సహాయకులను తెచ్చుకునే విధానానికి కేంద్రం ముగింపు పలకనున్నట్లుగా సమాచారం అందుతుంది. అవకతవకలు అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. పరీక్షల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, UPSC, SSC వంటి సంస్థలు సొంతంగా తయారు చేసుకున్న స్క్రైబ్ లను కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది.

అభ్యర్థి కన్నా స్క్రైబ్ వయసు 2, 3 విద్యా సంవత్సరాలు తక్కువగా ఉండాలని పేర్కొన్నారు. ఇద్దరూ ఒకే రకమైన పోటీ పరీక్ష కోసం ప్రిపేర్ అవుతూ ఉండకూడదని పేర్కొన్నారు.