కేసీఆర్ ను ఓడించేందుకు హరీష్ రావు ప్లాన్ వేశాడని గతంలో చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుత బీఆర్ ఎస్ పార్టీ నాయకులు వంటేరు ప్రతాప్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఆ రోజుల్లో రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి, వాస్తవాలు కాకపోయినా నేను హరీష్ రావు మీద విమర్శలు చేశానని వివరణ ఇచ్చారు వంటేరు ప్రతాప్ రెడ్డి.
ఆ విమర్శలు అవాస్తవం.. నాది తప్పు అని కూడా అప్పుడే ఒప్పుకున్నానని స్పష్టం చేశారు.

కొందరు దద్దమ్మలు ఆ పాత వీడియోలను ఇప్పుడు తిప్పుతున్నారు.. ఆ సన్నాసులకు చెప్పులతో సన్మానం చేస్తామని పేర్కొన్నారు. అప్పుడు మల్లన్న సాగర్ విషయంలో నేను తప్పు మాట్లాడాను.. హరీష్ రావు దగ్గర మీరు చేసింది కరెక్ట్.. నేను చేసింది తప్పు అని ఒప్పుకున్నానన్నారు. అప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి మల్లన్న సాగర్ మీద కొట్లాడినా కూడా నా తప్పును ఒప్పుకున్నాను అని స్పష్టం చేశారు వంటేరు ప్రతాప్ రెడ్డి. ఈ మేరకు ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇచ్చారు.
ఆ రోజుల్లో రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి, వాస్తవాలు కాకపోయినా నేను హరీష్ రావు మీద విమర్శలు చేశాను
ఆ విమర్శలు అవాస్తవం.. నాది తప్పు అని కూడా అప్పుడే ఒప్పుకున్నాను
కొందరు దద్దమ్మలు ఆ పాత వీడియోలను ఇప్పుడు తిప్పుతున్నారు.. ఆ సన్నాసులకు చెప్పులతో సన్మానం చేస్తాం
అప్పుడు మల్లన్న… pic.twitter.com/b57CV6dWJL
— Telugu Scribe (@TeluguScribe) September 4, 2025