ఇండో – పాక్ సరిహద్దుకు అమిత్ షా..

-

కేంద్రం హెం మంత్రి అమిత్ షా ఇండో-పాక్ సరిహద్దుకు వెళ్లనున్నారు. ఒక రోజు రాత్రి అక్కడే గడపనున్నారు. డిసెంబర్ 4న రాజస్థాన్ లోని జైసల్మీన్ అమిత్ షా పర్యటించనున్నారు. బీఎస్ఎఫ్ జవాన్లతో కలిసి అంతర్జాతీయ సరిహద్దు దగ్గర ఉండనున్నారు. అక్కడ బీఎస్ఎఫ్ జవాన్లతో మాట్లాడనున్నారు. ఇదిలా ఉంటే సరిహద్దుల్లో గడిపిన మొదటి హోం మంత్రిగా అమిత్ షా నిలువనున్నారు.

బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యనేతలు తరుచుగా ఆర్మీ, భద్రతా దళాల వద్దకు వెళుతున్నారు. దీపావళి సమయంలో కాశ్మీర్ లో సరిహద్దుల వద్ద ఆర్మీలో సంబరాలు చేసుకున్నారు ప్రధాన నరేంద్ర మోదీ. అంతకు ముందు రాష్ట్ర పతి కూడా భద్రతా దళాల వద్దకు వెళ్లారు. భద్రతా దళాల్లో మరింత ధైర్యాన్ని నింపేందుకు నాయకులు పర్యటనలు చేస్తున్నారు. ప్రధాని ప్రతీఏటా దీపావళిని సైన్యంతోనే జరుపుకుంటున్నారు. తాజాగా అమిత్ షా కూడా బీఎస్ఎఫ్ దళాలతో కలువనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version