తెలంగాణ రాష్ట్రం లో స్థానిక సంస్థల ప్రజా ప్రతి నిధు లను టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించు కోవడం లేదని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గా రెడ్డి ఆరోపించారు. గడిచిన రెండు సంవత్సరాల నుంచి రాష్ట్రం లో ప్రజా ప్రతి నిధులను పట్టించుకోలేదని అన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రజా ప్రతినధుల కు కనీసం నిధుల ను కూడా ఇవ్వ లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గా రెడ్డి అన్నారు.
అయితే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులను రంగం లో దింపడం తో ప్రజా ప్రతి నిధుల ను టీఆర్ ఎస్ ప్రభుత్వం గౌవిస్తుందని అన్నారు. అలాగే మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు లేవని స్పష్టం చేశారు. గతం లో వచ్చిన ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులను బ్లాక్ మెయిల్ చేసి తమ పార్టీ లో చేర్చు కున్నారని అన్నారు. మెదక్ జిల్లా విషయం లో టీఆర్ఎస్ పార్టీ కి అధిక మొత్తం లో ఓట్లు వస్తాయని అనుకుటుంన్నారని అన్నారు. కానీ మెదక్ జిల్లా లో తమ పార్టీ కి 230 ఓట్లు వస్తాయని జగ్గారెడ్డి అన్నారు. అలా రాకుంటే తన వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేస్తామని అన్నారు.