Amit Shah : అమిత్ షా తెలంగాణ పర్యటనలో మార్పులు

-

రాష్ట్రంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటనలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నెల 11నే అమిత్‌ షా హైదరాబాద్‌కు రానున్నారు. అమిత్ షా పర్యటన నేపథ్యంలో ఈ నెల 12న సంగారెడ్డిలో జరగాల్సిన బీజేపీ మేధావుల సమావేశం రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర నేతలు తెలిపారు. ఈ నెల 12 న అమిత్ షా కేరళ వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలోనే షా పర్యటన 11న ఖరారు చేసినట్లు వెల్లడించారు. అయితే 11న హైదరాబాద్‌కు వస్తోన్న షా.. రాష్ట్ర నేతలను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మొదట అమిత్ షా ఈనెల 12న రాష్ట్రానికి రానున్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే 12న ఆయన కేరళ వెళ్లనున్న నేపథ్యంలో ఒకరోజు ముందే హైదరాబాద్‌కు రానున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర నాయకులు షా పర్యటనకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. ఇంకా ఒకరోజే సమయం ఉన్నందున ఎలాంటి అసౌకర్యాలు, అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసే పనిలో పడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version