సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన హీరోయిన్ నగ్మా..!!

-

టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్ నగ్మా అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. గతంలో హాట్ హీరోయిన్ గా కూడా పేరుపొందింది ఈ ముద్దుగుమ్మ. ఈ మధ్యకాలంలో డిజిటల్ ఇండియా కాన్సెప్ట్ తో ఎక్కువగా జనాలు మనీని డిజిటల్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. దీంతో ఆన్లైన్ మోసాలు కూడా విపరీతంగానే పెరిగిపోవడం జరుగుతోంది. అలా ఈ రోజుల్లో కొన్ని వేల మంది ఆన్లైన్ ఫ్రాడ్ చేస్తూనే ఉన్నారు. తాజాగా సీనియర్ హీరోయిన్ నగ్మా కూడా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

తన మొబైల్ కి వచ్చిన ఒక మెసేజ్ క్లిక్ చేసి అడ్డంగా బుక్ అయ్యింది. ఫిబ్రవరి 28న నగ్మా మొబైల్ కి బ్యాంకు వాళ్లు పంపించినట్లు ఒక మెసేజ్ వచ్చిందట. అందులో ఉన్న లింకు పైన నగ్మా క్లిక్ చేయగా వెంటనే ఆమెకు ఫోన్ కాల్ వచ్చిందట బ్యాంకు ఎంప్లాయిగా పరిచయం చేసుకున్న ఆ ఘరానా మోసగాడు.. నేను మిమ్మల్ని గైడ్ చేస్తాను కేవైసీ కంప్లీట్ చేయండి అంటూ తెలియజేశారట. అయితే నగ్మా ఎలాంటి బ్యాంకు డీటెయిల్స్ షేర్ చేయకుండానే నేరగాడు తన ఆన్లైన్ బ్యాంకు అకౌంట్లోకి లాగిన్ అయ్యి బెనిఫిషరీ అకౌంట్ క్రియేట్ చేసుకుని దాదాపుగా లక్ష రూపాయలు ట్రాన్స్ఫర్ చేసుకున్నారట.

నేరగాడు లాగిన్ అయ్యే క్రమంలో మల్టిపుల్ అటెంప్ట్ చేశారని తన మొబైల్ కి అనేక ఓటీపీలు వచ్చాయని తెలిపింది నగ్మా .. పెద్ద అమౌంటు కాకుండా కేవలం లక్ష రూపాయల తోనే ఈ ఫ్రాడ్ నుంచి బయటపడ్డానని కాస్త సంతోషాన్ని తెలియజేస్తోంది. అదే బ్యాంకులో ఉన్న 80 మంది కస్టమర్స్ ఇదే తరహాలో మోసపోయినట్లుగా సైబర్ పోలీసులు కేసు నమోదు చేసుకోవడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version