ఇవాళ్టి నుంచి అమిత్ షా కశ్మీర్ టూర్..ఉగ్రవాదుల వార్నింగ్ !

-

ఆర్టికల్‌ 370 రద్దు చేసిన అనంతరం కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తొలిసారి జమ్ముూ కాశ్మీర్ పర్యటించనున్నారు. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు కశ్మీర్‌ లో పర్యటించనున్నారు అమిత్‌ షా. జమ్మూ కాశ్మీర్ లో నెలకున్న పరిస్థితి, భద్రత వ్యవహరాల పై ఈ సందర్భంగా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.

ఇక అమిత్‌ షా పర్యటన నేపథ్యంలో అదనంగా 25 పారామిలటరీ కంపెనీలను జమ్మూ కాశ్మీర కు తరలించింది కేంద్ర హోం శాఖ. ఇవాళ సాయంత్రం, శ్రీనగర్ నుంచి షార్జా కు తొలిసారిగా విమానయాన సేవలను ప్రారంభించనున్నారు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా.

అక్టోబర్ 24 వ తేదీన జమ్మూ లో బహిరంగ సభలో ప్రసంగించనున్న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా… అనంతరం పారిశ్రామిక రంగానికి చెందిన పలు సంస్థల ప్రతినిధులను కూడా కలవనున్నారు. అయితే.. కేంద్ర హోమ్ మంత్రి పర్యటనను అడ్డుకుంటామని తీవ్రవాదులు హెచ్చరించినట్లు సమాచారం అందుతోంది.  దాంతో అప్రమత్తమయ్యారు ఉన్నతాధికారులు. ఇందులో భాగంగానే…. భద్రతా వ్యవహరాలతో సంబంధమున్న వ్యవస్థలకు చెందిన అత్యంత ఉన్నత స్థాయు అధికారులు జమ్మూ కాశ్మీర్ లోనే మకాం వేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version