కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ హయాంలో ద్రవ్యోల్బణం రెండు అంకెల వృత్తికి చేరుకోగా ప్రభుత్వం దానిని ఐదు శాతం కంటే తక్కువగా ఉంచిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ముంబై లో జరిగిన ఇండియా గ్లోబల్ ఫారం వార్షిక పెట్టుబడి సదస్సు లో పాల్గొన్న అమిత్ షా మాట్లాడుతూ 2014లో కి ముందు భారత ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉండడంతో పాటుగా ద్రవ్యోల్బణం ఎక్కువ ఉందని ఆర్థిక రోడ్డు అదుపులో లేదని అన్నారు.
యూపీఏ హయాం లో జరిగిన 12 లక్షల కోట్ల కుంభకోణం కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ మీద నమ్మకం పోయిందని అన్నారు అయితే నేడు భారత్ అత్యంత దృఢంగా ఉందని అన్నారు భారత విధాన ఆధారిత రాష్ట్రంగా ఆవిర్భవించిందని అమిత్ షా అన్నారు.