కాంగ్రెస్ మేనిఫెస్టో వచ్చాక బీజేపీ గ్రాఫ్ పెరిగింది: అమిత్ షా

-

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇంకో సారి రాహుల్ గాంధీ మీద కాంగ్రెస్ మీద విమర్శలతో విరిచిపడ్డారు. దేశం అంతా షరియా చట్టాన్ని అమలు చేయాలని కాంగ్రెస్ భావిస్తుందని విమర్శించారు. ప్రజలు మాట మీద నిలబడే పార్టీ ని ఎంచుకోవాలని విజ్ఞప్తి చేసారు. శుక్రవారం ఇంటర్వ్యూ లో మాట్లాడి కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదలైన తర్వాత బిజెపి గ్రాఫ్ పెరిగిందని చెప్పారు.

వాళ్ళ మానిఫెస్టోలో కాంగ్రెస్ మళ్ళీ బుజ్జగింపు రాజకీయ వ్యాఖ్యలని హామీగా ఇవ్వడమే దీనికి కారణం అని అన్నారు. దేశాన్ని విభజించే వ్యక్తిగత చట్టాన్ని ముందుకు తీసుకెళ్తామని కాంగ్రెస్ మేనిఫెస్టో క్లియర్ గా చెప్తోందని దేశ పురోగతి అభ్యున్నతికి దోహదపడే పార్టీకి సపోర్ట్ ఇవ్వాలని ఓటర్లని కోరుతున్నానని అమిత్ షా అన్నారు దేశాన్ని చర్య చట్టం ప్రకారం ముందుకు తీసుకెళ్తారని రాహుల్ గాంధీని అడగాలనుకుంటున్నట్లు అమిత్ షా చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news