ఏపీకి కేంద్రం శుభవార్త : అదనంగా రూ. 2655 కోట్ల రుణాలకు అనుమతి

-

రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం మరో తీపి కబురు చెప్పింది. మూల ధనం వ్యయ లక్ష్యాన్ని చేరుకున్న 11 రాష్ట్రాలకు అదనంగా రూ . 15, 721 కోట్ల రుణాల కు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ 11 రాష్ట్రాల లిస్టు లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఉండటం గమనార్హం. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి అదనంగా రూ. 2655 కోట్లు బహిరంగ మార్కెట్లో రుణాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

jagan

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర GSDP లో 0.25 శాతం రుణాలకు అనుమతి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. 2021- 22 ఆర్ధిక సంవత్సరం మొదటి త్రైమాసికం లో కేంద్రం నిర్ధేశించిన లక్ష్యం ను చేరుకున్న 11 రాష్ట్రాలకు అదనపు రుణాలకు అనుమతి ఇచ్చింది. ప్రతి నాలుగు నెలలకు మూల ధనం వ్యయం లక్ష్యం సమీక్షించి అదనపు రుణాలకు అనుమతి ఇవ్వనుంది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగానే ఈ సారి 11 రాష్ట్రాలకు అదనంగా రూ . 15, 721 కోట్ల రుణాల కు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version