ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ ఏలూరు జిల్లాలోని దెందులూరులో ‘సిద్ధం’ సభలో పాల్గొన్నారు.దెందులూరు ‘సిద్ధం’ సభలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. సభా ప్రాంగణంలో ముఖ్యమంత్రి జగన్ ర్యాంప్ వాక్ చేస్తూ అభివాదం చేస్తుండగా ఓ వీరాభిమాని బారికేడ్లను దాటుకొని వాక్వే పైకి వచ్చారు. ఇది గమనించిన సీఎం సెక్యూరిటీ యువకుడిని వెనక్కి నెట్టే ప్రయత్నం చేయగా జగన్ ఆపారు. అతడితో సెల్ఫీదిగి అక్కడి నుంచి పంపించారు. ‘ఇదీ జగనన్న అంటే’ అనే క్యాప్షన్తో ఈ వీడియోను వైసీపీ శ్రేణులు వైరల్ చేస్తున్నాయి.
14 సంవత్సరాలు పాలించిన చంద్రబాబు పేదలకు ఇచ్చింది ఎంత? అని ‘సిద్ధం’ సభలో చంద్రబాబుని జగన్ ప్రశ్నించారు. ‘రామాయణం, భారతంలో ఉన్న విలన్లు చంద్రబాబు అండ్ కో అని అభివృద్ధిపై టీడీపీ దండయాత్ర చేస్తోంది విమర్శించారు. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్న ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించుకునేందుకు మీరు సిద్ధమా?’ అని ముఖ్యమంత్రి జగన్ ప్రశ్నించారు.ఈ సభకు 50 నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు.