హయత్‌నగర్ – లక్ష్మారెడ్డి పాలెం కాలనీ జాతీయ రహదారిపై విషాదం చోటు చేసుకుంది. మార్నింగ్ వాకింగ్ చేస్తున్న అడిషనల్ ఎస్పీని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. దింతో స్పాట్ లోనే అడిషనల్ ఎస్పీ మృతి చెందారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హయత్‌నగర్ – లక్ష్మారెడ్డి పాలెం కాలనీ జాతీయ రహదారిపై ఉదయం 4.30 గంటలకి వాకింగ్ చేస్తూ రోడ్డు దాటుతున్న అడిషనల్ ఎస్పీ TM నందీశ్వర బాబ్జీని ఢీకొట్టింది ఆర్టీసీ బస్సు.
మొదటగా ఒక బస్సు ఢీ కొట్టడంతో నందీశ్వర బాబ్జీ కిందపడ్డాడు. వెనకాలే వచ్చిన నూజివీడు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఎక్కడంతో బాబ్జీ అక్కడిక్కడే మృతి చెందాడు. ప్రస్తుతం రాచకొండ కమిషనరేట్ కంట్రోల్ రూంలో విధులు నిర్వహిస్తున్నాడు TM నందీశ్వర బాబ్జీ. ఇక TM నందీశ్వర బాబ్జీ మృతి నేపథ్యంలో కుటుంబ సభ్యులు విషాదంలోకి వెళ్ళింది.