ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ఇవాళ ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ కోల్కత్తా వేదికగా తొలి మ్యాచ్ జరుగుతుంది. తొలి మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ బెంగళూరు మధ్య ఫైట్ జరగనుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఈ మేరకు షెడ్యూల్ ఖరారు అయింది.
అయితే ఈ మ్యాచ్కు వర్షం అడ్డంకిగా మారే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. కోల్కతాలో ఇవాళ 90% వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో తొలి మ్యాచ్ రద్దు అయ్యే ప్రమాదం ఉన్నట్లు కూడా చెబుతున్నారు. ఒకవేళ మ్యాచ్ రద్దు అయితే చెరో పాయింట్ వెళ్తుంది.