విక్రమ్‌ ‘వీర ధీర శూర’ ట్రైలర్‌ రిలీజ్.. మీరు చూశారా?

-

కోలీవుడ్ హీరో చియాన్ విక్రమ్‌ తెలుగు ప్రేక్షకులకూ సుపరిచతమే. గతంలో తంగలాన్ సినిమాతో అలరించిన విక్రమ్ తాజాగా ‘వీర ధీర శూర’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దుషారా విజయన్‌, ఎస్‌.జె. సూర్య కీలక పాత్రలు పోషించారు. ఎస్‌.యు.అరుణ్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ తెలుగు ట్రైలర్‌ తాజాగా విడుదలైంది.

ఫుల్ ఆన్ యాక్షన్‌ సీన్స్‌తో అదరిపోయే బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ తో ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది. విక్రమ్ మరోసారి కమర్షియల్ గా హిట్ కొట్టబోతున్నాడంటూ ట్రైలర్ చూసిన నెటిజన్లు అంటున్నారు.  ఇక ఈ సినిమాలో విక్రమ్ లుక్ అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మార్చి 27వ తేదీన వీర ధీర శూర సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రం రెండు భాగాలుగా రానున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 27వ తేదీన ముందు పార్ట్-2ను విడుదల చేస్తున్నారు. ఆ తర్వాత ఈ చిత్రానికి ప్రీక్వెల్‌గా ‘పార్ట్‌-1’ను తీసుకురానున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version