రచయిత వినోద్‌ కుమార్‌ శుక్లాకు జ్ఞాన‌పీఠ్ అవార్డు

-

2024 ఏడాదికి సంబంధించి జ్ఞానపీఠ్‌ ఎంపిక కమిటీ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందులో ప్రముఖ హిందీ రచయిత వినోద్ కుమార్ శుక్లా జ్ఞానపీఠ్‌ (88) పురస్కారానికి ఎంపికయ్యారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నుంచి ఈ సాహిత్య పురస్కారాన్ని అందుకున్న మొదటి రచయితగా శుక్లా గుర్తింపు పొందారు. శుక్లా ఈ అవార్డుకు ఎంపికైన 12వ హిందీ రచయిత కావడం గమనార్హం. ఈ సందర్భంగా ఆయనకు రచయితలు, ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు.

ఈ పురస్కారం కింద రూ.11 లక్షల నగదు, సరస్వతి కాంస్య విగ్రహాన్ని పురస్కార గ్రహీతలకు అందజేస్తారు. భారతీయ సాహిత్యానికి అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ‘జ్ఞానపీఠ్ అవార్డు’ను అందజేస్తారన్న విషయం తెలిసిందే. 1944లో ఏర్పాటైన ఈ అవార్డును సాహిత్య రంగంలో దేశంలోనే అత్యున్నత గౌరవంగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో హిందీ సాహిత్యంలో వినోద్ కుమార్ చేసిన అద్భుతమైన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం దక్కింది. ఇక ఆయన 1999 సంవత్సరంలో సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version