ఉత్తరప్రదేశ్ లోని బస్తీ జిల్లాలో 13 ఏళ్ల బాలిక నికిత ‘అలెక్సా’ సాయంతో 15 నెలల చిన్నారి ప్రాణాలు కాపాడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. బాలిక తన అక్క కూతురుతో ఆడుకుంటూ ఉండగా కోతులు ఇంట్లోకి వచ్చి వస్తువులను చిందరవందర చేస్తూ బీభత్సం సృష్టిస్తూ అవి చిన్నారి వైపు రావడంతో బాలిక చాకచక్యంగా ఆలోచించి ‘అలెక్సా’కు కుక్కలా శబ్దాలు చేయాలని చెప్పింది. అలా శబ్దం రాగానే కోతులు బయటికెళ్లిపోయాయి
ఇక ఈ ఘటనలో చాకచక్యంగా వ్యవహరించిన 13 సంవత్సరాల బాలికకు మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ఊహించని ఆఫర్ ఇచ్చారు. చదువు పూర్తయ్యాక ఆమె కార్పొరేట్ ఉద్యోగం చేయాలని అనుకుంటే తమ కంపెనీలో చేరవచ్చని అన్నారు. టెక్నాలజీ ఎల్లప్పుడూ మానవ చాతుర్యానికి దోహదపడుతుందని చెప్పడానికి ఈ ఘటన నిదర్శనమన్నారు. ఆమె సమయస్ఫూర్తి అభినందనీయమని ఆనంద్ మహీంద్రా కొనియాడారు.