ఆరోజులే బాగున్నాయ్‌.. పాత రోజులు గుర్తుకు తెచ్చిన ఆనంద్ మహీంద్రా…!

-

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ ఉంటూ ఉంటారు. తన జీవితంలో ఎన్నో విషయాలను సమాజానికి సంబంధించిన పలు విషయాలను ఆయన పోస్ట్ చేస్తూ ఉంటారు. సామాజిక స్పృహ కూడా ఆయనకు చాలా ఎక్కువగానే ఉంటుంది. ఇక తాజాగా ఆయన షేర్ చేసిన వీడియో ఎంతగానో ఆకట్టుకుంది. అది ఏంటీ అంటే… చిన్న నాటి జ్ఞాపకాలను ఆయన పోస్ట్ చేసాడు.

ఈ వీడియోలో బాల్యాన్ని గుర్తుచేసే అనేక విషయాలు ఉన్నాయి. పాత వైర్డు టెలిఫోన్‌ల నుండి కెమెరా ఫిల్మ్ రోల్స్ మరియు మ్యూజిక్ క్యాసెట్ల వరకు ఉన్నాయి. ఇంటర్నెట్ లేని సమయంలో జనాలు వీటిని ఎక్కువగా వాడారు. చిడియా ఉడ్, ఖో ఖో ఆడటం మరియు బ్రౌన్ పేపర్ కవర్లతో నోట్ బుక్ లకు అట్టలు వేసుకోవడం… ఫ్రూటీ, లక్స్ సబ్బు, నిర్మా వాషింగ్ పౌడర్, జెల్లీ బెల్లీస్ మరియు మరెన్నో ఉత్పత్తులను ఆయన ఈ వీడియో లో ఉంచారు.

గోల్మాల్ చిత్రం నుండి కిషోర్ కుమార్ పాడిన ఆనే వాలా పాల్ జేన్ వాలా హై అనే పాటను కూడా జోడించారు. ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన ఒక గంటలోనే, ఈ వీడియో వేల వ్యూస్ సంపాదించింది. ముఖ్యంగా 90 తర్వాత పుట్టిన పిల్లలు… ఈ వీడియోని బాగా షేర్ చేస్తున్నారు. వాళ్ళకే ఇవి బాగా కనెక్ట్ అయ్యాయి ఆ రోజుల్లో.

Read more RELATED
Recommended to you

Exit mobile version