రాజకీయాల్లోకి రాను.. గతంలో పని చేశా: ఆనందయ్య

-

నెల్లూరు: ప్రస్తుతం రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని ఆనందయ్య తెలిపారు. గతంలో బీజేపీ, టీడీపీ, వైసీపీలో పని చేశానని ఆయన తెలిపారు. వెంకయ్య, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో తనకు పరిచయం ఉందన్నారు. వైసీపీ తరపున కృష్ణపట్నం సర్పంచ్‌గా పోటీ చేశానని పేర్కొన్నారు.

కరోనాకు ఆనందయ్య మందు పంపిణీ చేస్తున్న విషయం. ఈ మందుతో కరోనా బాధితులు కోలుకున్నారని ఆనందయ్య ఇప్పటికే స్పష్టంచేశారు. ఈ కరోనా మందుపై ప్రభుత్వం అధ్యయనం చేసింది. ఈ మేరకు మందు పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆన్ లైన్ ద్వారా మందు పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. త్వరలో పంపిణీ చేయనున్నారు. కంటిలో చుక్కల మందు మాత్రం పంపిణీ చేయరు. ఇక ఆనందయ్య మందు పంపిణీపై వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ పూర్తి అయింది. సోమవారం తీర్పు వెల్లడించే అవకాశం కనిపిస్తోంది.

కాగా కరోనా మందు పంపిణీతో ఆనందయ్య పేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతోంది. ఏపీలోని నెల్లూరు జిల్లాలో అయితే ఆయన దేవుడు అని అంటున్నారు. ఈ క్రేజ్‌తో ఆనందయ్య ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని ఆనందయ్య కొట్టిపారేశారు. తనకు ఆ ఆలోచన లేదని తెలిపారు. నెల్లూరు జిల్లాలో అన్ని పార్టీల నాయకులతో తనకు పరిచయాలు ఉన్నాయని ఆనందయ్య పేర్కొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version