స్టార్ హీరో మీద మనసు పడిన అనసూయ…!

-

ఈ మధ్య కాలంలో తెలుగు బుల్లి తెర మీద బాగా పాపులర్ అయిన హీరోయిన్ అనసూయ. ప్రేక్షకులను తన అందంతో ఆకట్టుకుంటుంది ఆమె. ఆమె అందానికి ఎందరో కుర్రాళ్ళు ఫిదా అయిపోయారు. జబర్దస్త్ షో చూడటం కూడా మొదలుపెట్టారు. ఇక ఆమె ఈ మధ్య కాలంలో అప్పుడప్పుడు సినిమాల్లో కూడా నటిస్తూ ఉంది. ఏదోక సినిమాలో ఆమెకు ఒక పాత్ర ఇస్తున్నారు దర్శక నిర్మాతలు.

రంగస్థలం సినిమాతో మంచి నటిగా ఆమె గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇక అక్కడి నుంచి ఆమెకు సినిమాల్లో మంచి క్రేజ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇక ఈ సమయంలోనే ఆమె మీద ఏదోక వార్త వస్తూనే ఉంది. వివాదాలు కూడా ఆమెను వెంటాడుతూ నే ఉన్నాయి. వాటికి ఆమె సమాధానం చెప్పినా సరే ఏదోక వార్త వస్తూనే ఉంటుంది. తాజాగా ఆమె ఒక లైవ్ షో లో పాల్గొంది.

అభిమానులతో తన జ్ఞాపకాలు పంచుకుంది. భారీ చిత్రాల దర్శకుడు శంకర్ మొదటి సినిమాగా వచ్చిన ‘జెంటిల్ మేన్’ సినిమా అంటే తనకు చాలా ఇష్టం అని చెప్పింది ఆమె. ఆ సినిమా చూసిన దగ్గర నుంచి తాను యాక్షన్ కింగ్ అర్జున్ కి అభిమానిగా మారిపోయానని చెప్పుకొచ్చింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ సినిమాతో ఆయనంటే క్రష్ ఏర్పడిందని వివరించింది. అప్పట్లో ఆయనకి నేను వీరాభిమానినని గుర్తు చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version