కరోనా పోరాటానికి పుల్వామా మృతుడి భార్య సాయం…!

-

కరోనా వైరస్ పై పోరాటంలో ఎవరి సహాయం వాళ్ళు చేస్తున్నారు. సినీ రాజకీయ, ఇతర ప్రముఖులు తమ వంతుగా ఎవరికి తోచిన సాయం వారు అందిస్తున్నారు. స్థాయికి తగిన విరాళాలు అందిస్తున్నారు. ఇక ఇదే సమయంలో పోలీసులకు కూడా సాయం చేస్తున్నారు. వైద్యులకు రక్షణ పరికరాలను కొనుగోలు చేసి అందిస్తున్నారు. కరోనా యోధుల్లో వీళ్ళే ముందు వరుసలో ఉన్నారు.

గత ఏడాది పుల్వామా దాడిలో అమరవీరుడైన మేజర్ విభూతి శంకర్ ధౌండియాల్ భార్య నితికా కౌల్ కొరోనా వైరస్ పై పోరాటంలో భాగంగా హర్యానా ప్రభుత్వానికి తన వంతు సహాయం అందించారు. హర్యానా పోలీసులకు 1000 రక్షణ వస్తు సామగ్రిని విరాళంగా అందించారు ఆమె. హర్యానా సిఎం, మనోహర్ లాల్ ఖత్తర్ ఆమె చేసిన సాయాన్ని అభినందించారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ కూడా చేసారు.

ఈ ఏడాది ఫిబ్రవరి లో ఆమె షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సి) పరీక్ష మరియు సర్వీసెస్ సెలక్షన్ బోర్డు (ఎస్ఎస్బి) ఇంటర్వ్యూను క్లియర్ చేసారు. భర్త మరణం తర్వాత ఆమె బయటకు రావడానికి ఆరు నెలల సమయం పట్టిందని, ఆ తర్వాత ఈ పరిక్షల కోసం ఆమె ప్రిపేర్ అయ్యారని అక్కడి అధికారులు చెప్పారు. పుల్వామాలో కారు బాంబు దాడిలో 40 మంది పారామిలిటరీ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిబ్బంది మరణించారు 34 ఏళ్ళ శంకర్ కూడా ప్రాణాలు కోల్పోయారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version