టాప్ లేపిన అనసూయ..మోడ్రన్ డ్రెస్సులో రంగమ్మత్త హొయలు

-

బుల్లితెర మీద ‘జబర్దస్త్’ షో తో సందడి చేస్తున్న స్టార్ యాంకర్ అనసూయ..మరో వైపు వెండితెరపైన కూడా సత్తా చాటుతోంది. ‘రంగస్థలం’ చిత్రంలో ‘రంగమ్మత్త’ పాత్ర పోషించి పాపులర్ అయిన అనసూయ..తర్వాత కాలంలో ఫుల్ బిజీ ఆర్టిస్ట్ అయింది.

ఇక సోషల్ మీడియాలో అనసూయ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇద్దరు పిల్లల తల్లి అయినా కూడా చెరగని అందంతో ఎనర్జిటిక్‌గా ఉంటూ అల్లరి చేస్తూ ఉంటుంది.ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోలు షేర్ చేస్తూ తన అందంతో కుర్రకారును ఫిదా చేస్తుంటుంది. తాజాగా ఇన్ స్టా గ్రామ్ లో స్లీవ్ లెస్ నీలి రంగు షార్ట్ ఫ్రాక్ లో దిగిన ఫొటోలు షేర్ చేసింది.

సదరు ఫొటోలు చూసి నెటిజన్లు ‘స్టన్నింగ్ లుక్స్ ,కూల్ స్మైల్’ అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. సుకుమార్ ‘పుష్ప’ సినిమాలోనూ ఈమె నటించింది. ‘దాక్షాయణి’గా నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది. ‘భీష్మపర్వం’ సినిమాతో మాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అనసూయ..ప్రస్తుతం పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version