ఆ దర్శకుడి కారణంగానే అనసూయ బుల్లితెరను వీడనుందా..?

-

అనసూయ.. గ్లామర్ షో కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఈ ముద్దుగుమ్మ నాలుగు పదుల వయసులో కూడా హాట్ అందాలతో రెచ్చిపోతుంది. ఇక ఇప్పటివరకు బుల్లితెరపై యాంకర్ గా చేసిన ఎంతోమంది నటీమణులు అనసూయ లాగా గ్లామర్ చూపించిన వారు లేరని చెప్పాలి. అందుకే బుల్లితెరపై అనసూయకు గ్లామర్ డాల్ అనే బిరుదు కూడా లభించింది. మొదటిసారి నాగ సినిమాలో స్టూడెంట్ క్యారెక్టర్ లో నటించిన అనసూయ ఆ తర్వాత ఎంబీఏ పూర్తి చేసి ఒక కంపెనీలో హెచ్ఆర్ గా కూడా పనిచేసింది. ఆ తర్వాత సాక్షి న్యూస్ ఛానల్ లో న్యూస్ రీడర్ గా అవకాశం రావడంతో అక్కడ కొన్ని రోజులు పనిచేసి, ఆ తర్వాత జబర్దస్త్ వేదికపై తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది.

2013లో మొదలైన జబర్దస్త్ కామెడీ షో నిర్విరామంగా 9 సంవత్సరాల విజయవంతంగా పూర్తి చేసుకున్న తరుణంలో ఇన్ని సంవత్సరాలు అనసూయ తన అందంతో.. యాంకరింగ్ తో .. చలాకితనంతో ప్రేక్షకులను అలరించింది. ఇక కేవలం బుల్లితెరపై పలు షో లకు యాంకర్ గా వ్యవహరించడమే కాకుండా వెండితెరపై కూడా తన సత్తా చాటుతుంది ఈ ముద్దుగుమ్మ. క్షణం, రంగస్థలం, పుష్ప వంటి సినిమాలతో తన మార్కును ప్రూవ్ చేసుకుంది. ఇక లేడి ఓరియంటెడ్ చిత్రాలు చేస్తూనే మరొకవైపు పలు ఐటమ్ సాంగ్లకు గ్లామర్ అద్దింది. ఇక బుల్లితెరపై మాత్రమే కాదు వెండితెరపై అలాగే వెబ్ సిరీస్లలో నటిస్తూ బిజీగా ఉన్న అనసూయ త్వరలోనే జబర్దస్త్ కామెడీ షో కి స్వస్తి పలకనుంది.

ఇక మాటీవీలో ఈమె ఒక ప్రోగ్రాంకి యాంకర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.. కానీ అందరూ కూడా ఈ షో కోసమే జబర్దస్త్ ను వీడనుంది అంటూ వార్తలు వినిపించాయి.కానీ ఇందులో నిజం లేదని తాజాగా సమాచారం అందుతోంది. అసలు విషయం ఏమిటంటే అనసూయ ప్రస్తుతం డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ఒక వెబ్ సిరీస్ చేస్తోంది. ఇక వెబ్ సిరీస్లో ఆమె వ్యాంప్ పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. గురజాడ కన్యాశుల్కం నాటిక ఆధారంగా తీస్తున్న ఈ వెబ్ సిరీస్ లో మధురవాణి లాంటి క్యారెక్టర్ లో అనసూయ నటిస్తోంది. ఇక ఈ వెబ్ సిరీస్ కి డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం, రంగ మార్తాండ, పుష్ప 2 లో ఈమె నటిస్తూ వుండడం వల్ల ఆమె జబర్దస్త్ కి గుడ్ బై చెప్పినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version