యాంకర్ సుమ ఆ వ్యాధితో బాధపడుతుందా..దానివల్ల చాలా ఇబ్బందిపడుతుందట..!

-

యాంకర్ సుమ..ఈ పేరు తెలియనివాళ్లు ఉండరు.. అమ్మమ్మల నుంచి అమ్మాయల కాలం వరకూ ఈమె యాంకరింగ్ కి ఫిదా అవ్వాల్సిందే. ఈ కాలం యాంకర్స్ ని కూడా ఇలా ఊదేయగల సత్తా యాంకర్ సుమాకు ఉంది. కేరళానుంచి వచ్చి తెలుగు ప్రేక్షకులు అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఎంటర్‌టైన్మెంట్ కు బ్రాండ్ అంబాసిడర్ లా మారిపోయింది మన సుమ. ఆన్టీ అంటే అస్సలు ఒప్పుకోదు. హీరోయిన్లకంటే ఎక్కవ సంపాదిస్తుందని బయట టాక్..ఒక్కో ఎపిసోడ్ కి లక్ష రూపాయలు వసూలు చేస్తుందట. బుల్లితెరపై మకుటంలేని మహారాణీలా రాణిస్తుంది. ఈమె గురించి ఇలా చెప్పుకుంటే పోతే మాటలు చాలవండోయ్.. ఇలా ఎక్కడకున్న అందిరిని నవ్విస్తూ..నవ్వుతూ ఉండే సుమకు ఓ భయకరమైన వ్యాధి ఉందట. అది మీలో ఎంతమందికి తెలుసు..?

ఎన్నో ఏళ్లుగా తాను బాధపడుతున్న ఒక వ్యాధి గురించి అభిమానులకు చెప్పుకొని షాక్ ఇచ్చింది సుమ. సుమకు కీలాయిడ్ టెండెన్సీ అనే స్కిన్ ఇన్ఫెక్షన్ ఉంది. కొన్నేళ్లుగా ఈ వ్యాధితో బాధ పడుతున్నట్లు సుమ తెలిపింది. అదేదో మేకప్ వేసుకుంటే వచ్చేసాధారణ ఇన్పెక్షన్ కాదు. ఈ వ్యాధి ఉన్నవాళ్ళకు చర్మంపై చాలా సమస్యలు వస్తుంటాయి. ఏదైనా చిన్న దెబ్బ తగిలినా కూడా అది మరింత పెద్దదే అవుతుంది కానీ తగ్గదు. ఈ వ్యాధి ముఖ్య లక్షణం కూడా ఇదే. ముఖ్యంగా యాంకరింగ్ ఫీల్డ్‌లో ఉండే సుమకు ఈ వ్యాధి రావడం మరింత ఆందోళనకరమే.

నిత్యం మేకప్‌తోనే సావాసం చేయాల్సి ఉంటుంది. అంటే ఆ కాస్మోటిక్స్ పవర్ కారణంగా చర్మంపై మరిన్ని సమస్యలు వచ్చే అవకాశం లేకపోలేదు. ఆ కష్టాలు చెప్పడానికి అన్నీఇన్నీ కావు. మేకప్ వేసుకున్న ప్రతిసారి ఇబ్బందులు తప్పవట. అలాగే లైట్ ఫోకస్ కారణంగా వేడి కూడా వస్తుంది. మన ముందు నవ్వించే సుమ పాపం మేకప్ వేసుకుని చాలా ఇబ్బందులు పడుతుందట.

ఈ సమస్యని పోగొట్టుకోవడానికి చాలా ప్రయత్నించినా కూడా కుదర్లేదట. యాంకరింగ్ మొదలు పెట్టిన కొత్తల్లో ముఖానికి మేకప్ ఎలా వేసుకోవాలి.. ఎలా తీసేయాలి లాంటివి తెలియక ఈ వ్యాధి వచ్చినట్లు సుమ బాధ పడింది సుమ. ఇప్పుడు ఉన్నదాన్ని కాపాడుకోవడం తప్ప తన చేతుల్లో ఏమీ లేదని తెలిపింది. ఈమెకు ఈ వ్యాధి ఉందని తెలిసిన తర్వాత అభిమానులంతా షాక్ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version